News January 26, 2025
సిద్దిపేట: ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలి: జడ్జి

ఖైదీలు తమ హక్కులను తెలుసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన లీగల్ అవెర్నెస్ కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆర్థిక స్థితి లేని ఖైదీలు ఉచితంగా ప్రభుత్వ పరంగా లాయర్లను పెట్టుకోవచ్చని సూచించారు.
Similar News
News December 6, 2025
HNK: వెంకట్ రెడ్డి టీంపై ఏసీబీ గురి?

HNK రెవెన్యూ శాఖలో అక్రమాలు జరిగాయని ACB అధికారులకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చినట్లు తెలిసింది. HNK అడిషనల్ కలెక్టర్గా ఉన్న వెంకట్ రెడ్డిపై పలు భూములకు సంబంధించి రెవెన్యూ కోర్టులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీకి అనుకూలంగా ఉన్న అధికారులు ఎవరెవరు ఉన్నారో కూపీ లాగుతున్నారు. వెంకట్ రెడ్డి వచ్చినప్పటి నుంచి జరిగిన తీర్పులు, ఆర్డర్లపై విచారణ జరపాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
News December 6, 2025
మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం పోలీస్

వాట్సాప్లకు వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసి మోసపోవద్దని ప్రకాశం పోలీసులు తాజాగా హెచ్చరించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లవద్దని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు. బ్యాంక్, అధికారుల పేర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు.
News December 6, 2025
జగన్కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగన్కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన ఆయన పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.


