News June 6, 2024

సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో BRS ఆశలు గల్లంతు !

image

మెదక్‌ MP స్థానాన్ని దక్కించుకోవాలని చూసిన BRSకు నిరాశే మిగిలింది. ఇక్కడ ఏడుకు 6 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో సరాసరి ఓట్లు వచ్చినా.. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోవటంతో పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత MLA ఎన్నికలతో పోల్చితే తాజాగా సిద్దిపేటలో BRSకు 40,013, గజ్వేల్‌లో 26,252, దుబ్బాకలో 31,165 ఓట్లు తగ్గాయి.

Similar News

News November 14, 2025

పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

image

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

News November 14, 2025

విద్యాసాగర్ రావు కృషి అసామాన్యం: హరీశ్ రావు

image

సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ విద్యాసాగర్ రావు అసామాన్యమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని హరీశ్ రావు తెలిపారు.

News November 13, 2025

మెదక్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణం కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.