News March 4, 2025
సిద్దిపేట: గవర్నర్ను కలిసిన జిల్లా కలెక్టర్

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి రాగా జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ వేరువేరుగా పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తదుపరి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.
News November 8, 2025
కనకదాసు చిత్ర పటానికి SP నివాళి

భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ శనివారం నివాళులర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించి విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సమానత్వానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం కుల, మత తేడాలను చెరిపివేసేలా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్ బాషా, 1 టౌన్ సీఐ మహేశ్వర పాల్గొన్నారు.
News November 8, 2025
రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు

రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్(84) గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ICUలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలియగానే రజినీకాంత్ హుటాహుటిన చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


