News January 28, 2025

సిద్దిపేట: గుండెపోటుతో బ్యాంక్ ఉద్యోగి మృతి

image

సిద్దిపేటలోనీ హీడీఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న సుంకరి రమేష్(38) గుండె పోటుతో మరణించారు. మంగళవారం డ్యూటీలో ఉండగానే ఒక్కసారిగా హార్ట్ ఏటాక్ రావడంతో ఆఫీసులోనే మరణించాడు. మృతుడు రమేష్ ది మిడిదొడ్డి మండలం ధర్మారం గ్రామం. రమేష్‌కి భార్య మాధురి, కొడుకు రిషి వర్ధన్(13), భువన(11) ఉన్నారు.

Similar News

News February 15, 2025

TG SETను మళ్లీ నిర్వహించాలి: BRS

image

గత ఏడాది SEPలో నిర్వహించిన TG SETలో పెద్ద తప్పిదం జరిగిందని BRS ఆరోపించింది. 100 ప్రశ్నల హిస్టరీ పేపర్‌లో 39 ప్రశ్నలు తప్పు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు రికార్డు సృష్టించిందని ట్వీట్ చేసింది. ‘రెండు పేపర్లలో 40 ప్రశ్నలు తప్పుగా ఇచ్చి రేవంత్ తెలంగాణ పరువు తీశారు. 40 ప్రశ్నలకు 50 మార్కులు ఏ లెక్కన కలిపారు? రేవంత్ రాజీనామా చేయాలి. దీనిపై UGC విచారణ జరిపి పరీక్షను మళ్లీ నిర్వహించాలి’ అని డిమాండ్ చేసింది.

News February 15, 2025

మీర్పేట్: అధ్యక్షురాలికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

image

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ జాగృతి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మిర్యాల పావనిని ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

News February 15, 2025

చికెన్‌లో ఈ భాగాలు తింటున్నారా?

image

కోడిలో దాదాపు అన్ని భాగాలనూ మనం తింటాం. కానీ దాని మెడ, తోక, ఊపిరితిత్తుల్ని తినకుండా ఉండటమే శ్రేయస్కరమంటున్నారు ఆహార నిపుణులు. ఆ భాగాల్లో ఉండే హానికరమైన క్రిములు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా చర్మంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ ఉంటాయని, స్కిన్ లెస్ తినడమే బెటర్ అని సూచిస్తున్నారు.

error: Content is protected !!