News February 6, 2025
సిద్దిపేట: గురుకుల ప్రవేశాలకు నేడే లాస్ట్

రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా అధికారులు సూచించారు. 2025–26లో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ఖాళీలు, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News February 27, 2026
వదినమ్మకు ఆనంద్ దేవరకొండ అదిరిపోయే వెల్కమ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన వదినకు వెల్కమ్ చెప్పారు. ‘ఫ్యాన్స్ తనను కలిసినప్పుడల్లా ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది’ అని ఆనంద్ సరదాగా పేర్కొన్నారు. అత్యంత దయగల, పాజిటివ్ పర్సన్ వదినగా రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ జంట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఆకాంక్షించారు.
News February 27, 2026
తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు
News February 27, 2026
ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


