News March 20, 2025
సిద్దిపేట: గేట్ ఫలితాల్లో మెరిసిన యువకుడు

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రావణ్ రెడ్డి ఆల్ ఇండియాలో 807వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు. కాగా శ్రావణ్ రెడ్డి చిన్ననాటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News July 9, 2025
VJA: ‘క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోండి’

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో అమరావతిలో 2 రోజుల పాటు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేశామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న తుళ్లూరు CHC, 11న యర్రబాలెం UHCలో ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. క్యాన్సర్ నిర్ధారణ సేవలు, అవగాహన కార్యక్రమాలు ఈ క్యాంపుల ద్వారా అందిస్తున్నామని, స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.
News July 9, 2025
కిక్కిరిసిన పలాస-ఆమదాలవలస ట్రైన్

పలాస-ఆమదాలవలస ప్యాసింజర్ రైలు బుధవారం ప్రయాణికులతో సంద్రాన్ని తలపించింది. సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సింహాచలం తరలి రావడంతో రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. ట్రైన్‌లో కనీసం కాలు పెట్టుకునేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేయాలని కోరారు.