News February 23, 2025

సిద్దిపేట: గ్రామం నుంచి జాతీయ స్థాయికి

image

బహుజన సమాజ్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి కోఆర్డినేటర్‌గా ఎన్నికైన బెజ్జంకి మండల వాసి నిషాని రామ చంద్రంను శనివారం బెజ్జంకిలో మానకొండూర్ నియోజకవర్గ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. బాధ్యతలను అప్పగించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాతంగి తిరుపతి, మల్లయ్య, నిషాని రాజమల్లు, సుమలత, గుర్రం సత్యనారాయణ, రాజు, కనకం రఘు పాల్గొన్నారు.

Similar News

News February 23, 2025

న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు.. మళ్లింపు

image

అమెరికాలోని న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ AA292ను ఇటలీలోని రోమ్ నగరానికి మళ్లించారు. తుర్కియే వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

News February 23, 2025

బాలానగర్‌‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

image

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 23, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు శంకర్‌పల్లి మండలంలో 37.8℃, మొయినాబాద్ 37.4, ఫరూఖ్ నగర్ 37.3, ఇబ్రహీంపట్నం 37.2, కేశంపేట 37.2, హయత్ నగర్ 37.1, సరూర్‌నగర్ 37.1, శేరిలింగంపల్లి 37, కొందుర్గ్ 36.9, షాబాద్ 36.6, తలకొండపల్లి 37, అబ్దుల్లాపూర్మెట్ 35.8, నందిగామ 35.8, చేవెళ్ల 35, రాజేంద్రనగర్ 36.1, శంషాబాద్ 35.5, బాలాపూర్ 35.6, కందుకూరు 36.2, మహేశ్వరం 35.5℃గా నమోదైంది.

error: Content is protected !!