News February 8, 2025

సిద్దిపేట: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావాహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

Similar News

News April 10, 2026

రోడ్డు భద్రతపై గ్రామసభలు నిర్వహించాలి: ఎస్పీ

image

జిల్లాలో ఈ నెల 13న అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రత గ్రామసభలు, ర్యాలీలు నిర్వహించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రతిజ్ఞ చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధన అమలు చేయాలని, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తేజస్ ధాన్యం కొనుగోలుపై చర్చించారు.

News April 10, 2026

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే, ఇండస్ట్రియల్ పార్కులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 10, 2026

మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

image

మెలానియా సడన్‌గా ఎప్‌స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్‌ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్‌స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.