News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
Similar News
News November 14, 2025
నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.
News November 14, 2025
వైజాగ్‌కు మదర్‌సన్ ఐటీ కంపెనీ

మదర్‌సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ (MTSL) కంపెనీ ₹109.73 కోట్ల పెట్టుబడితో వైజాగ్‌లో ఐటీ R&D, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడ (కాపులుప్పాడ ఐటీ పార్క్)లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా AI/ML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో 700 ఉద్యోగాలు వస్తాయి. AP IT & GCC పాలసీ 4.0 కింద G.O.MS.No. 61 (12-11-2025) జారీ చేసింది.
News November 14, 2025
కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.


