News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
Similar News
News April 22, 2025
దొంగతనాలపై ప్రత్యేక దృష్టి :ఎస్పీ మహేష్ బి.గీతే

దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గీతే అన్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి దొంగతనాల నియంత్రణకు సహకరించాలన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వేసవిలో పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.
News April 22, 2025
కైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో 100% బొగ్గు ఉత్పత్తి

బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో 100% బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం కైరిగూడ ఓపెన్ కాస్ట్‌ను సందర్శించిన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బొగ్గు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూనే ఈ వార్షిక సంవత్సరంలోనూ 100%ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న పాల్గొన్నారు.
News April 22, 2025
భూ భారతిపై ఎలాంటి అపోహలు వద్దు: కలెక్టర్ గౌతమ్

భూభారతి చట్టంపై ఏలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం శామీర్ పేట మండలం తూంకుంటలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగహన కల్పించారు. ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.