News July 17, 2024
సిద్దిపేట: ఘోరం.. బాలుడిని 20 నిమిషాలు కరిచిన కుక్కలు

HYD జవహర్‌నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు నిహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.
Similar News
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.