News February 16, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కొమురవెల్లి కమాన్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్నా మమతా, భీమయ్య, మమత, పలయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 21, 2025
సంగారెడ్డి: విషాదం.. నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడి మృతి

చౌటకూర్ మండలం శివంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు ఫైజల్ మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. 2 గంటల తర్వాత నీటి తొట్టిలో ఫైజల్ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నయీం కుమారుడైన ఫైజల్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 21, 2025
నెల్లూరు ప్రజలకు గమనిక

నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం PGRS కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్జీల స్థితిగతులు, తదితర వివరాల కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News December 21, 2025
పైరేటెడ్ మూవీ యాప్స్‌తో జాగ్రత్త: MHA హెచ్చరిక

ఫ్రీ సినిమాల కోసం పర్సనల్ డేటా, సెక్యూరిటీని రిస్క్‌లో పెట్టుకోవద్దని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫ్ఫైర్స్ హెచ్చరించింది. తెలియని యాప్స్‌లో లభించే పైరేటెడ్ కంటెంట్ చూస్తే సైబర్ రిస్క్, లీగల్ ఇబ్బందులు ఎదురుకావొచ్చని చెప్పింది. లక్షల మంది వాడుతున్న ‘Pikashow App’ కూడా సురక్షితం కాదని తెలిపింది. ఈ యాప్స్‌తో మొబైల్‌లోకి వచ్చే మాల్వేర్, స్పైవేర్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరీ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.


