News February 16, 2025

సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కొమురవెల్లి కమాన్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్నా మమతా, భీమయ్య, మమత, పలయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 15, 2026

పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధ నౌకలు!

image

భారత నేవీకి చెందిన పలు యుద్ధ నౌకలను ఇరాన్‌కు సమీపంలోని పర్షియన్ గల్ఫ్‌లో మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా వైపు వచ్చే వాణిజ్య నౌకలకు అవసరమైతే సాయం అందించేందుకు అవి అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. మరోవైపు LPG గ్యాస్‌తో వస్తున్న రెండు భారత షిప్‌లు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అందులోని శివాలిక్ ట్యాంకర్ ఈనెల 21న దేశానికి చేరుకోనుంది.

News March 15, 2026

కర్నూలులో ‘ఆకలి కేక’

image

కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడిందని పేర్కొంటూ హోటల్, బేకరీ వంట మాస్టర్స్ యూనియన్(AITUC) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలన్నారు.

News March 15, 2026

అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

image

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.