News March 13, 2025

సిద్దిపేట: ఘోర రోడ్డ ప్రమాదం వ్యక్తి మృతి

image

సిద్దిపేట జిల్లా నర్సంపేట కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. నర్సంపేట గ్రామానికి చెందిన వనం రాజు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 26, 2026

పోలవరం: ఆవులపై దాడి చేసిన పెద్దపులి?

image

పోలవరం జిల్లాలో పులి సంచారం కలవర పెడుతోంది. రోజూ ఏదొక ప్రాంతంలో ప్రజలకు పులి తారస పడడంతో బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

News February 26, 2026

BREAKING: మెదక్ కలెక్టర్ బదిలీ

image

మెదక్‌ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రాజ్ 2024 మార్చి 6న ఆదిలాబాద్ నుంచి మెదక్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. మెదక్ కలెక్టర్‌గా రంగారెడ్డి (లోకల్ బాడీస్) అదనపు కలెక్టర్ 2019 బ్యాచ్‌కు చెందిన ప్రతీమ సింగ్ IAS నియమితులయ్యారు.

News February 26, 2026

BREAKING: భువనగిరి కలెక్టర్ బదిలీ

image

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.