News March 1, 2025

సిద్దిపేట: చికెన్‌పై అసత్య ప్రచారాలు వద్దు: హరీశ్ రావు

image

చికెన్‌పై సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. 70 డిగ్రీల వరకు ఉడకపెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదన్నారు‌. ఇందులో భాగంగా ఆయన చికెన్ తిని జనాల్లో భయం పోగెట్టే ప్రయత్నం చేశారు. 

Similar News

News November 19, 2025

అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

image

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.

News November 19, 2025

VZM: ‘100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సిద్ధం కావాలి’

image

పదో తరగతిలో ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు డిసెంబర్ 5వ తేదీ లోపు సిలబస్ పూర్తిచేయాలని DEO మాణిక్యం నాయుడు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గత ఏడాది 87% పాస్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం సిలబస్ పూర్తి చేసి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు.

News November 19, 2025

ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

image

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్‌లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.