News March 1, 2025
సిద్దిపేట: చికెన్‌పై అసత్య ప్రచారాలు వద్దు: హరీశ్ రావు

చికెన్‌పై సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. 70 డిగ్రీల వరకు ఉడకపెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదన్నారు. ఇందులో భాగంగా ఆయన చికెన్ తిని జనాల్లో భయం పోగెట్టే ప్రయత్నం చేశారు.
Similar News
News March 22, 2025
నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్

AP: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 22, 2025
నిప్పంటుకున్న సిలిండర్.. స్థానికుల ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా హెచ్‌పీ గ్యాస్ ఆఫీస్ ముందు ప్రమాదవశాత్తు చిన్న సిలిండర్‌కు నిప్పు అంటుకుంది. వెంటనే సిలిండర్‌పై నీళ్లు పోసి ఆర్పేందుకు సిబ్బంది యత్నించారు. గ్యాస్ గోదాం వద్ద ఫైర్ సేఫ్టీ లేకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సూచనలు చేసే గ్యాస్ గోదాం అధికారులే నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని పలువులు స్థానికులు చర్చించుకుంటున్నారు.
News March 22, 2025
ADB: ఈ నెల 23 నుంచి రెండో విడత కరెక్షన్

ఆదిలాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వృక్షశాస్త్రం,జంతుశాస్త్ర అధ్యాపకులు ఇంటర్మీడియట్ రెండో విడత మూల్యాంకనంలో పాల్గొనాలని DIEO జాధవ్ గణేశ్ సూచించారు. ఈ నెల 23న జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ నెల 24 భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం మూల్యంకనం జరుగుతుందన్నారు. అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని కోరారు.