News March 27, 2025
సిద్దిపేట: చూపు తిప్పుకోలేకపోతున్నారు..

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో ఒక రైతు వెరైటీ ఆలోచన చేశాడు. తన భూమిలో వేసిన మిరప పంటకు దిష్టి తగలకుండా అందాల సినిమా తార శ్రీలీలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. దీంతో అటు వైపుగా వెళుతున్న వాహనదారులు, బాటసారులు మిరప పంటపై కాకుండా అందాల తార పై దృష్టి పెడుతున్నారు. గ్రామానికి చెందిన రైతు ఉప్పలయ్య పొలంలోనిది ఈ దృశ్యం.
Similar News
News December 7, 2025
రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.
News December 7, 2025
తిరుపతి: అటు ర్యాగింగ్… ఇటు లైంగిక వేధింపులు

ఎస్వీయూలో ఇటీవల ర్యాగింగ్ కలకలం.. తాజాగా NSU లైంగిక వేధింపులతో తిరుపతి విద్యా కేంద్రానికి చెడ్డపేరు వచ్చింది. ఇలాంటి విద్యాలయాల్లో యువతులకు భద్రత ఎంత? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీల కమిటీలు, మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వర్సిటీల అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి.


