News April 11, 2024

సిద్దిపేట: చేపల వేటకు వెళ్లి ఇద్దరు కార్మికులు మృతి

image

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి-ముత్యంపేట గ్రామాల మధ్య కెనాల్‌లో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఏపీకి చెందిన తిరుపతి రావు(30), సోమయ్య(30)గా గుర్తించారు. మృతులిద్దరు స్థానిక NPS కెనాల్‌లో కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 18, 2025

మెదక్: కక్షపూరిత కేసులపై బీఆర్ఎస్ సీరియస్.. డీజీపీకి ఫిర్యాదు

image

మెదక్ బీఆర్‌ఎస్ టౌన్ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుపై పెట్టిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసును రద్దు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డిని బీఆర్‌ఎస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హాని అన్నారు. ఆంజనేయులుపై కేసును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

News November 18, 2025

MDK: వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకున్నారు. విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు సూచనలు ఇచ్చి అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 18, 2025

మెదక్: బాలుడిపై దాడి చేసిన పినతండ్రి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

మద్యం మత్తులో బాలుడిపై దాడి చేసిన పిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. అక్కన్నపేటకు చెందిన ముత్యం సత్యనారాయణ, వంశి అనే బాలుడిని ఈనెల 13న మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను మంగళవారం రిమాండ్‌కు తరలించారు.