News February 5, 2025
సిద్దిపేట: జాతీయస్థాయి ఈత పోటీలకు జిల్లా వాసి

గుజరాత్ రాష్ట్రంలో మార్చి 3న జరిగే జాతీయ స్థాయి ఈత పోటీలకు సిద్దిపేట జిల్లా వాసి బండి నర్సింలు ఎంపికయ్యారు. హైదరాబాదులోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఈవి నరసింహారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు బండి నరసింహులు జాతీయస్థాయి క్రీడా పోటీలలో గెలుపొంది మంచి పేరు తేవాలాన్నారు.
Similar News
News February 12, 2025
వాలంటైన్స్ వీక్: ఇవాళ HUG DAY

ప్రేమను వ్యక్తపరిచేందుకు అనేక రకాల మార్గాలున్నాయి. ఫిజికల్ ఎఫెక్షన్‌ను చూపించేందుకు వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ హగ్ డే జరుపుకొంటారు. ప్రేమను, ధైర్యాన్ని, భరోసాను ఇలా వ్యక్తపరుస్తూ ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. హగ్ ఇవ్వడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా బీపీ కంట్రోల్‌లో ఉంటుందట. హాయికరమైన నిద్ర, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.
News February 12, 2025
42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: ఆర్ కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచకుండా కులాల వారీగా జనాభా లెక్కలు తప్పుగా చూపిస్తూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
News February 12, 2025
ఇంద్రవెల్లి: మాజీ సర్పంచ్ మృతి

ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.