News April 6, 2025

సిద్దిపేట: జాతీయ సదస్సులో పాల్గొననున్న మంత్రి పొన్నం

image

రేపు డెహ్రాడూన్‌లో జరిగే సామాజిక న్యాయం, సాధికారతపై జరిగే సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. 6, 7న జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొని సామాజిక న్యాయం, సాధికారతపై ప్రసంగించనున్నారు.

Similar News

News April 20, 2025

డీలిమిటేషన్‌‌కు మేం వ్యతిరేకం కాదు: స్టాలిన్

image

డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా చేయాలనే కోరుతున్నామని తమిళనాడు CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలా చేస్తే సౌత్ స్టేట్స్‌‌కు నష్టం. వాయిదా వేసి సమన్యాయం జరిగేలా చూడాలంటున్నాం. హిందీ వల్ల నార్త్‌లో ఎన్నో రాష్ట్రాలు మాతృ భాషను కోల్పోయాయి. TNలో ఆ పరిస్థితి రానివ్వం’ అని వ్యాఖ్యానించారు.

News April 20, 2025

హనుమకొండ: నేటి చికెన్ ధరలు ఇలా..

image

హనుమకొండ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. హోల్ సెల్ ధర రూ.116-118, రిటైల్ రూ.141, డ్రెస్‌డ్ చికెన్ రూ.200, స్కిన్ లెస్ చికెన్ రూ.230గా ఉంది. రెండు రోజుల క్రితం ఎక్కువగా ఉన్న చికెన్ రేట్లు ఈరోజు కొంత తగ్గాయి. బర్డ్ ప్లూ ప్రభావం లేకపోవడంతో చికెన్ అమ్మకాలు కొంత మేర పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

News April 20, 2025

సంగారెడ్డి: మెడికల్ కళాశాలలో 99.24 ఉత్తీర్ణత

image

ఎంబీబిఎస్ సెకండ్ ఇయర్ ఫలితాలను కేఎన్ఆర్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 99.24 ఉత్తీర్ణత నమోదైందని కళాశాల ప్రిన్సిపల్ డా. సుధామాధురి తెలిపారు. ఇందులో 80 మంది వైద్య విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించగా ఐదుగురు విద్యార్థులు డిస్టెన్షన్‌లో రాణించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ అభినందించారు.

error: Content is protected !!