News January 29, 2025
సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థి

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు మహాత్మ దౌల్తాబాద్ గురుకుల కళాశాల విద్యార్థి ఆర్.అమృత రావు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల నల్గొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈనెల 29న ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే పోటీలో పాల్గొననున్నట్లు తెలిపారు.
Similar News
News December 18, 2025
రూ.1.6 లక్షలు.. సైనికులకు ట్రంప్ క్రిస్మస్ గిఫ్ట్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ సైనికులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.1.6 లక్షల ($1,776) ‘వారియర్ డివిడెండ్’ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 1776లో దేశ స్థాపనకు గుర్తుగా ఆ మొత్తాన్ని మిలిటరీ సర్వీస్ మెంబర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులు సిద్ధమయ్యాయని, పండుగకు ముందే సైనికులకు అందుతాయని చెప్పారు. దేశంలోని 14.5 లక్షల మంది సోల్జర్లకు ఈ మొత్తం అందనుంది.
News December 18, 2025
SRD: 21 ఏళ్లకే సర్పంచ్గా గెలుపు

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం అలీఖాన్ పల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుగులోతు రోజా సమీప ప్రత్యర్థిపై 76 ఓట్లతో విజయం సాధించారు. 21 సంవత్సరాల రోజా ఇంటర్ దాకా చదివింది. రోజా విజయంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని సర్పంచ్ రోజా తెలిపారు.
News December 18, 2025
టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.


