News January 30, 2025

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు మృతి

image

సిద్దిపేట జల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మృతి చెందారు. బండరాళ్లు మీద పడి తల్లి సరోజన, కూమార్తె మమత అక్కడికక్కడే మరణించారు. బండరాళ్లు కిందపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 13, 2025

పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

image

పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మీనాక్షి కంపెనీ (వేదాంత పవర్), సింహపురి జిందాల్ కంపెనీ, నవయుగ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతినిధులు తెలిపిన పలు సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా మార్గాలపై దిశానిర్దేశం చేశారు.

News February 13, 2025

MTM: వల్లభనేని వంశీ అరెస్ట్.. ఎస్పీ కీలక ప్రకటన 

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్‌- 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 

News February 13, 2025

దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

image

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

error: Content is protected !!