News September 7, 2024

సిద్దిపేట జిల్లాలో దారుణం.. చెత్తకుప్పలో శిశువు

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేట మెదక్ రహదారి పక్కన అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. తిమ్మాపూర్ గ్రామ శివారులోని గోదాంల వద్ద చెత్తకుప్పలో పడవేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 17, 2025

మెదక్: ‘తపాలా శాఖ ద్వారా ఓటర్లకు గుర్తింపు కార్డులు’

image

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.

News October 17, 2025

నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

image

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

News October 16, 2025

మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.