News April 9, 2025
సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. తొగుట మండలం కన్గల్‌లోని ఓ లేయర్ కోళ్ల ఫామ్‌లోని కోళ్లకు H5N1(బర్డ్‌ఫ్లూ) నిర్ధరణ కావడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫాంలోని కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయనున్నారు.
Similar News
News November 5, 2025
NEET-SS దరఖాస్తులు ప్రారంభం

NEET-SS దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. DM/MCh, DrNB తదితర సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఈ నెల 25 వరకు NBEMS వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 26, 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 22న అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. ఫలితాలను 2026 జనవరి 28 లోపు వెల్లడిస్తారు. పీజీ చేసిన వారు(MD/MS/DNB) దరఖాస్తుకు అర్హులు.
News November 5, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.
News November 5, 2025
రాష్ట్ర భవిష్యత్తుకే తలమానికం: మంత్రి డోలా

విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగావకాలు వస్తాయన్నారు.


