News March 14, 2025

సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

image

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 9, 2025

MDK: ఎన్నికల అధికారి కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

image

నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు ఆటోను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ఓ మహిళకు తాకింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన ఇన్నోవా కారు నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్‌దిగా తెలుస్తుంది.

News December 9, 2025

మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

image

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.

News December 9, 2025

మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.