News March 14, 2025

సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

image

జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 11, 2026

MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

News March 11, 2026

ఫైల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సెక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.

News March 10, 2026

అవయవ మార్పిడి పాలసీపై మంత్రి సమీక్ష

image

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అవయవ మార్పిడి చట్టం(THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి దామోదర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ దానాలను ప్రోత్సహించే విధంగా విధానాలను సరళీకృతం చేయాలని, చికిత్స ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.