News February 12, 2026
సిద్దిపేట జిల్లాలో 82.03 % పోలింగ్

సిద్దిపేట జిల్లాలో 82.03% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారీగా గజ్వేల్‌లో 79.35%, దుబ్బాకలో 85.03%, హుస్నాబాద్‌లో 84.21%, చేర్యాలలో 83.41% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి తెలిపారు. <<19114696>>దుబ్బాక<<>>లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 176 పోలింగ్ కేంద్రాల్లో 1,01,085 మంది ఓటర్లు ఉండగా 82,918 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది.
Similar News
News March 11, 2026
ఏలూరు: రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగే అవకాశం!

ఏలూరు కార్పొరేషన్ పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఏసీబీ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో కీలక రికార్డులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు ఎలా ఇస్తున్నారు అనే అంశంపై, ఇటీవల బదిలీ అయినప్పటికీ కొందరు అధికారులు పలుకుబడిని ఉపయోగించి తిరిగి ఏలూరులోనే కొనసాగడంపై అధికారులు ఆరా తీశారు. దాడులు బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
News March 11, 2026
గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్.. విచారణకు ఆదేశం

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.
News March 11, 2026
MBNR: లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల వివరాలు.. పట్టణానికి చెందిన ఓ మహిళ రాత్రి రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకుని మున్సిపాలిటీని దాటగానే బైక్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా PSకు చేరుకొని ఫిర్యాదు చేసింది.


