News February 6, 2025
సిద్దిపేట జిల్లా తగ్గిన చికెన్ ధరలు

సిద్దిపేట జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రోజుల క్రితం కిలో రూ. 240కిపైగానే అమ్మగా గురువారం ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్లెస్ KG రూ. 210 రూ. 220 వరకు, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ కోళ్ల చనిపోవడం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
Similar News
News November 13, 2025
మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
News November 13, 2025
కేంద్ర పథకాల అమలులో పురోగతి కనిపించాలి: కలెక్టర్

కేంద్ర పథకాల అమలులో కచ్చితమైన పురోగతి చూపించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కేంద్ర పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లాభం చేకూరే విధంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, వేగం నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
News November 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


