News March 18, 2025

సిద్దిపేట జిల్లా ప్రజలారా.. జర జాగ్రత్త

image

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావొద్దని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు.

Similar News

News October 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 28, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 7.00 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 28, 2025

కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాదపు హెచ్చరిక జారీ

image

‘మెంథా’ తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో సోమవారం సాయంత్రం 5వ ప్రమాదవ హెచ్చరిక ప్రకటన చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు. గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని అర్థం. ఈ నంబర్ల హెచ్చరికలు జారీచేస్తే పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపేయాలి. కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు సెలవు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు

News October 28, 2025

చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.