News January 27, 2025
సిద్దిపేట జిల్లా ప్రజావాణికి 117 దరఖాస్తులు

సిద్దిపేట జిల్లా ప్రజావాణికి 117 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ మనూచౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా తదితరులు ఉన్నారు.
Similar News
News February 18, 2025
వేములవాడ: బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని బోనాలతో దర్శించుకున్నారు. భక్తుల రాకతో బద్ది పోచమ్మ ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్స్‌లర్‌కి విశాఖతో అనుబంధమిదే..!

ఏయూ వైస్-చాన్సలర్‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News February 18, 2025
అప్పులు చేయడానికి కేసీఆర్ రావాలా?: మంత్రి జూపల్లి

TG: కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలకు దిగారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునేది మళ్లీ అప్పులు చేయడానికేనా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఉందని దుయ్యబట్టారు. సర్పంచ్ బిల్లులు బకాయిలు పెట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని అనడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాలుగు స్తంభాల ఆట నడిచిందని విమర్శించారు.