News July 16, 2024
సిద్దిపేట: ‘జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి కవిత తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్‌తో కూడిన ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 31వ తేదీ వరకు tsstudycircle. Co.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 25, 2026
మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ. విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
News February 25, 2026
మెదక్: తొలిరోజు 99.42 శాతం

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.
News February 25, 2026
మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.


