News April 11, 2025
సిద్దిపేట: జైనమత కేంద్రంగా నంగునూరు

జైన మత ప్రధాన కేంద్రంగా నంగునూరు పరిసర ప్రాంతాలు విరాజిల్లినట్టు కొత్త తెలంగాణ చారిత్రక బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నంగునూరు పరిసర ప్రాంతాలైన ధూల్మిట్ట, బైరాన్ పల్లి, పూల్లూరు, పొట్లపల్లి, నర్మెట్ట గ్రామాల్లో జైన మతానికి సంబంధించి అనేక ఆనవాళ్లు లభించాయని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.
Similar News
News April 16, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News April 16, 2026
‘వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలి’

వ్యవసాయ భూములను నివాస ప్రాంతాల నుంచి తొలగించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి అనామిలి కమిటీ సమావేశం గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించారు. నివాస ప్రాంతాల ధరల మాదిరిగానే వ్యవసాయ భూములకు ధరలను నిర్ణయించడంపై వచ్చిన అర్జీలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు మేలు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మార్కెట్ వాల్యూ జిల్లా రిజిస్టర్ కమిటీ కన్వీనర్ ప్రసాద్ పాల్గొన్నారు.
News April 16, 2026
10-20% పెరగనున్న మందుల ధరలు?

క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఫార్మా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని నేషనల్ మీడియా పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో ముడిపదార్థాల రవాణాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని కంపెనీలు కోరినట్లు తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు తాత్కాలికంగా 3 నెలలు వరకు మాత్రమే ఉంటుందని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ధరలు తగ్గిస్తారని సమాచారం.


