News March 12, 2025

సిద్దిపేట: జ్యోతిష్యం పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్

image

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని మద్దూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీను మాట్లాడుతూ.. జీ టీవీలో జ్యోతిష్యం చెప్తాను అనే ప్రకటన నమ్మి రూ.50 వేలను నారాయణ చారి ఇచ్చాడు. పూజ మధ్యలో ఉంది తిరిగి మరో రూ.50 ఇవ్వాలని చెప్పడంతో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాడు. తిరిగి మళ్లీ డబ్బులు పంపాలని అడగగా 1930ను ఆశ్రయించాడు.

Similar News

News October 22, 2025

సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

image

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్‌షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.

News October 22, 2025

చిత్తూరు: కోనల్లో కైలాసవాసుడు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కోన అనే పదం వినిస్తుుంటుంది. జీవకోన, తలకోన, కైలాసకోన, మూలకోన, సదాశివకోన, ఝరికోన ఇలా.. ఆయా ప్రాంతాల్లో కైలాసనాథుడు కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో కొండల్లో నుంచి జాలువారే ఈ నీటిలో స్నానం చేసి శివుడు దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మీ దగ్గర ఇలా కోనలు ఉంటే కామెంట్‌లో చెప్పండి.

News October 22, 2025

వయసుతో నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు

image

* స్నేహితులు దూరమైనా నీతో నీకున్న బంధమే ముఖ్యం
* జనాలు నీ కష్టం కాకుండా ఫలితాలను మాత్రమే చూస్తారు
* వైఫల్యాలు జీవితంలో భాగమే
* ఇల్లు లాంటి మంచి చోటు మరొకటి లేదు
* జీవితంలో ముఖ్యమైనవి కుటుంబం, డబ్బు
* వ్యాయామం మనసుకు శాంతి, శరీరానికి బలం ఇస్తుంది
* పశ్చాత్తాపం, కన్నీళ్లు మీ సమయాన్ని వృథా చేస్తాయి
* అదృష్టం కాదు.. మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. Share it