News March 12, 2025
సిద్దిపేట: జ్యోతిష్యం పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్

జ్యోతిష్యం పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని మద్దూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీను మాట్లాడుతూ.. జీ టీవీలో జ్యోతిష్యం చెప్తాను అనే ప్రకటన నమ్మి రూ.50 వేలను నారాయణ చారి ఇచ్చాడు. పూజ మధ్యలో ఉంది తిరిగి మరో రూ.50 ఇవ్వాలని చెప్పడంతో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాడు. తిరిగి మళ్లీ డబ్బులు పంపాలని అడగగా 1930ను ఆశ్రయించాడు.
Similar News
News March 7, 2026
తనకు రక్షణ కల్పించాలి: హర్షవీణ ఫిర్యాదు

తనకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ శనివారం రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైకోర్టు ఇచ్చిన కండిషన్ బెయిల్ మేరకు ప్రతి శనివారం కోడూరు పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలన్నారు. ఈ మేరకు స్టేషన్‌లో హాజరయ్యి తన కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటుందని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News March 7, 2026
NGKL: జిల్లాలో ఇప్పటివరకు 8,61,333 బస్తాల యూరియా పంపిణీ

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8,61,333 బస్తాల యూరియా పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాప్ ద్వారా 3,20,626 బస్తాల యూరియా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 62,942 మంది రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. గత యాసంగితో పోలిస్తే ఈసారి 66 ఎకరాల సాగు అధికంగా పెరిగిందని గుర్తు చేశారు.
News March 7, 2026
డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే.. ఎన్ని గంటలు నిద్రపోవాలి?

డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించాలంటే రోజూ రాత్రి 7గంటల 18నిమిషాలు నిద్రపోవాలని తాజా స్టడీ వెల్లడించింది. BMJ ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ జర్నల్ ప్రకారం.. ఈ నిర్ణీత సమయం కంటే కాస్త అటూఇటుగా తక్కువ లేదా ఎక్కువ నిద్రపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌పై ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు నిద్రపోతే గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతినే ప్రమాదం ఉంది. నిద్ర మెటబాలిక్ హెల్త్‌ను మెరుగుపరుస్తుందని ఈ స్టడీ తేల్చింది.


