News February 26, 2026
సిద్దిపేట: టాస్క్ సెంటర్‌లో ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్

సిద్దిపేట ఐటీ టవర్‌లోని టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ‘ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్’ అవకాశం కల్పిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇన్ఫోసిస్, డీట్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. 2023-2026 మధ్య బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. గురువారం సాయంత్రం లోగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం మొదటి 200 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ ప్రకటించారు. అయితే ఆయనకు గాయాలయ్యాయని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోకుంటే మరోసారి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా-ఇరాన్ శాంతి చర్చల కోసం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
News April 16, 2026
GWL: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

గద్వాల చేనేత చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని, నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం అనంత ఫంక్షన్ హాల్లో నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలకు సంబంధించి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో 1761 మంది నేత కార్మికులకు రూ.11 కోట్ల రుణమాఫి చెక్కులు అందజేశారు.
News April 16, 2026
NZB: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నరనే సమాచారంతో దాడి చేసినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న న్యాలం శ్రీనివాస్, పాపి భూదేవితో పాటు ఒక విటుడిని, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు SHO వివరించారు.


