News February 12, 2025

సిద్దిపేట: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

image

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 25, 2025

కెప్టెన్‌ను బోర్డు కన్సల్టెంట్‌గా నియమించిన పాక్

image

పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తమ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ & ప్లేయర్స్ అఫైర్స్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఇది చాలా అరుదైన, ఆశ్చర్యకర నిర్ణయమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కెప్టెన్‌గా ఉన్న వ్యక్తికి బోర్డు అడ్మినిస్ట్రేటివ్ సెటప్‌లో స్థానం కల్పించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు పాక్‌కే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News October 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News October 25, 2025

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి..!

image

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, అధికార వర్గాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.