News January 30, 2025
సిద్దిపేట: ‘డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి’

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్లో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ సంభందించిన డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ గూర్చి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో చర్చించారు.
Similar News
News November 10, 2025
పచ్చిపాలతో ముఖానికి మెరుపు

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను కాటన్ బాల్స్‌తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.
News November 10, 2025
తిరుమల: వైవీ సుబ్బారెడ్డికి సిట్ విచారణ తప్పదా..?

తిరుమల కల్తీ నెయ్యి విచారణలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్ విచారణకి పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా విచారణకు వైవీ వస్తే మరింత మంది అధికారులు, బయట వ్యక్తుల పాత్ర బయటపడే పరిస్థితి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో వైవీ విచారణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News November 10, 2025
అనార్పల్లి వాగులో పత్తి వాహనం బోల్తా

పత్తి లోడుతో వాగు దాటుతున్న ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటన కెరమెరి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కెరమెరి మండలం అనార్పల్లి వాగుపై వంతెన లేకపోవడంతో వాగు అవతలి వైపు ఉన్న ఆరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వంతెన లేకపోవడంతోనే పత్తి వాహనం బోల్తా పడినట్లు చెబుతున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.


