News January 30, 2025

సిద్దిపేట: ‘డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి’

image

సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్లో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ సంభందించిన డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ గూర్చి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో చర్చించారు.

Similar News

News February 14, 2025

NZB: ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్‌కు టీయూ P.D

image

హైదరాబాద్ వేదికగా ఈ నెల 15 నుండి 16 వరకు జరగనున్న ‘ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ 2025’లో తెలంగాణ యునివర్సిటీ వ్యాయామ విద్యలో సహాయ ఆచార్యులు(సి)గా పని చేస్తున్న డాక్టర్.బి.ఆర్.నేతకు చోటు లభించింది. ఇందుకు ఆయన టీయూ వైస్ ఛాన్సలర్ ప్రో.టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో.యాదగిరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నేతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News February 14, 2025

మెదక్: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

image

నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.

News February 14, 2025

నర్సాపూర్ (జి): వ్యక్తిపై హత్య ప్రయత్నం కేసు నమోదు: SI

image

పాత కక్షలతో ఓ వివాహితను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం ఎల్లన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పొడిచాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

error: Content is protected !!