News April 7, 2025
సిద్దిపేట: డెహ్రాడూన్ వెళ్లిన మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క

ఈనెల 7, 8 తేదీల్లో సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన డెహ్రాడూన్‌లో చింతన్ శివిర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. చింతన్ శివిర్‌లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చేసిన వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొననున్నారు.
Similar News
News November 4, 2025
NLG: ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా.!

NLG జిల్లాలో ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. గ్రామాలు, మున్సిపల్ కేంద్రాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని, క్షేత్రస్థాయిలోని అధికారులపై ఉన్నతాధికారులు ఓ వైపు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, నదులు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతం ఇసుక తేలే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. అధికారులు స్పందించి ఇసుకను సరఫరా చేయాలన్నారు.
News November 4, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 4, 2025
NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

వానకాలం సీజన్‌కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.


