News February 7, 2026

సిద్దిపేట: డేంజర్.. జిల్లాలోకి పెద్దపులి ఎంటర్

image

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్‌వో లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News March 17, 2026

GNT: నాటకరంగ దిగ్గజం పెద్ది రామారావు

image

రచయిత పెద్ది రామారావు గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో 1973 మార్చి 17న జన్మించారు. ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీహెచ్‌డీ చేశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ ‘ఋతురాగాలు’ సీరియల్‌కు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ‘యవనిక’ అనే నాటక మాసపత్రికను నడిపి నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి ‘అందరివాడు’, ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలకు ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించారు.

News March 17, 2026

కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

image

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.

News March 17, 2026

మాజీ MLA రోహిత్ రెడ్డికి BRS షోకాజ్ నోటీసు

image

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఓ పార్టీలో రోహిత్ డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇలాంటి విషయాల్లో పార్టీ అధినాయకత్వం కఠినంగా ఉంటుందని, అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.