News February 13, 2025
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ 3రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కాంతారావు తీర్పునిచ్చారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. కొద్దిరోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురిని పట్టుకున్నారు. వీరికి రూ.8వేల జరిమానా విధించగా.. ముగ్గురికి జైలు శిక్ష విధించారు.
Similar News
News March 18, 2025
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే వెళ్లారు.. చివరకు..!

బట్టతలపై జుట్టు వస్తుందనుకున్న 67 మంది మోసపోయారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఇద్దరు వ్యక్తులు జుట్టు చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. తాము అందించే నూనె వాడితే జుట్టు వస్తుందని చెప్పగా స్థానికులు నమ్మారు. చివరకు ఆ నూనె వాడిన 67 మంది ఇన్ఫెక్షన్లు వచ్చి ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు శిబిరం నిర్వహించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎలాంటి నైపుణ్యం, అనుమతి లేకుండా వారు శిబిరం నిర్వహించినట్లు చెప్పారు.
News March 18, 2025
తిరుపతిలో దాడిపై స్పందించిన ఈసీ

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో హింస జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎట్టకేలకు స్పందించింది. ఎంపీ గురుమూర్తి చేసిన ఆరోపణలపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఈసీ ముఖ్య కార్యదర్శి కేఆర్‌బీ హెచ్ఎన్ చక్రవర్తి లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేశారని ఈసీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.
News March 18, 2025
27 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్స్ అందించాలని ఈవో శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యూలైన్లు, పాతాళగంగ తదితర ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.