News March 27, 2025

సిద్దిపేట: తండ్రి మందలించాడని.. కొడుకు ఆత్మహత్య

image

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోహెడ (M) రాంచంద్రపూర్‌కు చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపారి. ప్రశాంత్(19) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఏ పని చేయడం లేదని తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ 21న పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు KNR ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Similar News

News November 2, 2025

తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

News November 2, 2025

శుభ కార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలను ఎందుకు ధరించాలి?

image

శుభకార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలు ధరించడానికి వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణి చుట్టూ ‘ఓరా’ అనే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందట. పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఇది మరింత శక్తివంతంగా మారుతుందట. పట్టు వస్త్రాలు చుట్టూ ఉన్న ఈ సానుకూల శక్తిని ఆకర్షించి, మన శరీరమంతటా ప్రసరించేలా చేస్తుందట. అందుకే పెళ్లిళ్లు, పూజాది క్రతువులు, దేవాలయ దర్శనాల్లో పట్టు వస్త్రాలు ధరించడం ఆనవాయితీ.

News November 2, 2025

మెదక్‌లో మూడు చారిత్రక శాసనాలు

image

మెదక్ పట్టణ నడిబొడ్డున మూడు చారిత్రక విలువైన శాసనాలు అందుబాటులో ఉన్నాయని ఔత్సాహిక చారిత్రక పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. గిద్దెకట్ట చెరువు ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక శాసనం మట్టిలో కలిసి పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానిని భూమిలోంచి తీసి పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మరొక శాసనం నవాబ్‌పేటలో ఖిల్లా వెనుక నల్లరాతిపై చెక్కించినట్లు సంతోష్ పేర్కొన్నారు.