News February 13, 2025
సిద్దిపేట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.
Similar News
News March 28, 2025
డీసీసీ ప్రెసిడెంట్ల సమావేశంలో పాల్గొన్న గద్వాల నాయకులు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనదైన శైలిలో దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఢిల్లీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గద్వాల జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
News March 28, 2025
సిరిసిల్ల: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో సిరిసిల్ల జిల్లాలో 1,73,793 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.
News March 28, 2025
ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి: పుతిన్

పుతిన్ చస్తేనే యుద్ధం ఆగిపోతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ <<15901820>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో UNO పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. అప్పుడే ఆ దేశంలో ఎన్నికలకు వీలుంటుందని, ప్రజల విశ్వాసంతో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చలు జరపాలని అనుకుంటున్నామని చెప్పారు. దీంతో జెలెన్‌స్కీతో చర్చలకు విముఖంగా ఉన్నట్లు పరోక్ష సందేశాలిచ్చారు.