News March 6, 2025
సిద్దిపేట: తండ్రి మరణం.. ‘కూతురికి పరీక్ష’

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్‌కు చెందిన పసుల లింగం(50) బైక్‌పై తూప్రాన్ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.
Similar News
News March 24, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు 90.94% హాజరు

జనగామ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి ఎం.రమేష్ తెలిపారు. మొత్తం 41 సెంటర్లలో బాలురు 2,975, బాలికలు 3,231కు మొత్తం 6,206 గాను… బాలురు 2,973, బాలికలు 3,229 హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 90.94% హాజరయ్యారు.
News March 24, 2025
క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: రాహుల్ శర్మ

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించగలమన్నారు. సంక్రమిత వ్యాధుల్లో క్షయ ఒకటని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను హరించేస్తుందని తెలిపారు.
News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.