News March 6, 2025
సిద్దిపేట: తండ్రి మరణం.. ‘కూతురికి పరీక్ష’

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్‌కు చెందిన పసుల లింగం(50) బైక్‌పై తూప్రాన్ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.
Similar News
News December 18, 2025
రేషన్ కార్డుదారులు e-KYC తప్పనిసరి: DSO

రేషన్ కార్డుదారులందరికీ e-KYC తప్పనిసరి అని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రేషన్ డీలర్లు షాపులను తెరిచి ఉంచి, తమ పరిధిలోని కార్డుదారులందరితో 100 శాతం e-KYC చేయించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించి, గడువులోగా ప్రక్రియ ముగిసేలా చూడాలని స్పష్టం చేశారు.
News December 18, 2025
రేవంత్ రెడ్డి పతనానికి సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం: హరీష్‌రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పతనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. మెదక్‌లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News December 18, 2025
MDK: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

ఈనెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డివి శ్రీనివాసరావు కోరారు. లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశం ఉన్న వివిధ రకాల కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు.


