News February 13, 2025
సిద్దిపేట: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.
Similar News
News November 6, 2025
JNTUలో Way2News ఎఫెక్ట్

‘JNTU క్వార్టర్స్ ఖాళీ చేయాలని నోటీసులు.. పట్టించుకోని వైనం’ అని Way2Newsలో వచ్చిన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. దీనిపై పూర్తి నివేదిక అందజేయాలని JNTUH అధికారులను కోరినట్లు సమాచారం. PhDలు పూర్తైనా వేరే వారికి అవకాశం ఇవ్వకుండా JNTUలో ఉంటూ పెత్తనాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు వర్సిటీ యంత్రాంగం సిద్ధమైనా.. కొందరు ప్రలోభాలు పెడుతూ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
News November 6, 2025
కృష్ణా: పంచారామాల బస్సులకు.. ఆన్లైన్ రిజర్వేషన్

పంచారామాలు, అరుణాచలం, విశిష్ఠ శైవ క్షేత్రాలు, అలాగే యాగంటి, మహానంది, శ్రీశైలం త్రిలింగ దర్శినికి RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నవంబర్ 8,9 తేదీల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి శని, ఆదివారం రాత్రి స్పెషల్ సర్వీసులు నడవనున్నాయని RTC అధికారులు తెలిపారు. ప్రయాణికులు ONLINEలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చుని సూచించారు.
News November 6, 2025
పిఠాపురంలో నకిలీ నెయ్యిపై వైసీపీ ట్వీట్

పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో మరోసారి నకిలీ నెయ్యి వెలుగులోకి వచ్చిందని వైసీపీ ట్వీట్ చేసింది. పశువుల కొవ్వుతో మాధవ నగర్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేశారన్నారు. భారీగా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారని, మీ నియోజకవర్గంలో కల్తీ నెయ్యి తయారవుతున్నా నిద్రపోతున్నావా పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేసింది.


