News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 16, 2025
32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.
News December 16, 2025
10 నిమిషాల వీడియో కావాలా? HYDలో కొత్త దందా!

‘మీకు 10 నిమిషాల ఆ వీడియో కావాలా? జస్ట్ రూ.200. 30 నిమిషాల లైవ్ చాట్ రూ.300. 2 గంటల లైవ్ అశ్లీల వీడియో చాట్ రూ.500. కింద కనిపిస్తున్న అమ్మాయిల నంబర్లకు కాల్ చేయండి.’ అంటూ SMలో కొత్త దందా మొదలైంది. ముందుగా డబ్బులు పంపి, ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేయాలని కండీషన్ పెడుతారు. టెంప్టై ఆ పని చేయకండి. ఆ తరువాత వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని HYD పోలీసులు సూచించారు.
News December 16, 2025
ఎన్నికల ప్రాంతాల్లో 18 ఉదయం వరకు నిషేధాజ్ఞలు: సీపీ

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుమికూడటం, ర్యాలీలు, సభలు నిర్వహించడం నేరమని ఆయన స్పష్టం చేశారు.


