News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 20, 2025
తాండూరులో సోమవారం ప్రజావాణి

తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని సిబ్బంది నవీన్ తెలిపారు. గత వారం హాలిడే సందర్భంగా ప్రజావాణి రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో గతవారం కొందరు వ్యక్తులు హాలిడే అని తెలియక ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినట్టు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News April 20, 2025
జంగంపల్లిలో మల్బరీ తోటను సందర్శించిన రాష్ట్ర జాయింట్ డైరెక్టర్

బిక్కనూర్ మండలం జంగంపల్లిలోని మల్బరీ తోటను ఆదివారం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ లత సందర్శించారు. విత్తన క్షేత్రం 75 ఎకరాలు ఉందని జిల్లా పట్టుపరిశ్రమ అధికారి ఐలయ్య తెలిపారు. విత్తన క్షేత్రాన్ని పూర్తిగా ఆమె పరిశీలించారు. భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూములు ఆక్రమణకు గురి అయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంకేతిక అధికారి నాగేంద్రయ్య పాల్గొన్నారు.
News April 20, 2025
KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.