News February 4, 2025
సిద్దిపేట: ‘తల్లీకూతుర్లు మృతి.. ఆదుకోండి’

గత నాలుగు రోజుల క్రితం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనికి వెళ్లిన కూలీలపై మట్టి బండరాళ్లు విరిగిపడడంతో తల్లి-కూతుర్లు మృతి చెందారు. కొంతమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని హుస్నాబాద్ ఆర్డీఓకు సిద్దిపేట జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) పక్షాన వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 5, 2025
కరాటే పోటీలకు మెదక్ విద్యార్థుల ఎంపిక

69వ రాష్ట్రస్థాయి SGF ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు కరాటే విద్యార్థులు ఎంపికైనట్లు సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ తెలిపారు. అండర్-14 విభాగంలో విశిష్ట రాజ్, సాయిచరణ్, కనిష్కచారి, అర్మన్, అండర్-17లో అఖిల్, అండర్-19లో నిత్య సిరి, ఐశ్వర్య, అబ్దుల్లా ఎంపికయ్యారు. విద్యార్థులను SGF మెదక్ జిల్లా సెక్రెటరీ నాగరాజు, హవేలిఘనపూర్ ఎంఈఓ మధుమోహన్ అభినందించారు.
News November 5, 2025
మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


