News March 4, 2025
సిద్దిపేట: తైక్వాండో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

మార్చి 1, 2 తేదీలలో హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 13వ ఓపెన్ స్టేట్ లెవెల్ ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపియన్షిప్‌లో సిద్దిపేట జిల్లా తైక్వాండో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 12 మెడల్స్ సాధించారని తైక్వాండో కార్యదర్శి మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను సిద్దిపేట జిల్లా తైక్వాండో అధ్యక్షుడు రాధాకృష్ణశర్మ, ఉపాధ్యక్షుడు రామ్మోహన్ అభినందించారు.
Similar News
News December 13, 2025
మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
News December 13, 2025
కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 13, 2025
మరీ కాకతీయ సంగతేందీ..?

ఎందరినో మేధావులుగా చేసిన కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న వర్సిటీ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదింది. KU కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. BRS హయాంలో నిధులు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియాకు రూ.వేయి కోట్లు విడుదల చేయగా, KUకి కూడా రూ.వేయి కోట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై కామెంట్?


